బీజేపీ బీసీలకు రాజ్యాధికారం ఇస్తోందని, తాను ఆ పార్టీకి మద్దతివ్వడానికి ప్రధాన కారణం ఇదేనని జనసేన అధినేత పవన్ అన్నారు. ఆయన  శనివారం వికారాబాద్ జిల్లా తాండూలో బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థి శంకర్‌గౌడ్ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… తెలంగాణలో బీసీల చేతికి రాజ్యాధికారం రావాలని ఆకాంక్షించారు. ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని ఆకాంక్షించారు. తనకు జన్మనిచ్చింది ఆంధ్రప్రదేశ్ అయితే, పునర్జన్మనిచ్చింది తెలంగాణ అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి తాను రుణపడి ఉంటానన్నారు. ఇక్కడ ప్రజలకు అన్యాయం జరిగితే తిరగబడతానన్నారు. కేంద్రంలో మరోసారి ఎన్డీయే ప్రభుత్వం రావాలని వ్యాఖ్యానించారు.