మాజీ మంత్రి ఏ చంద్రశేఖర్ బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే సమక్షంలో ఆయనతో పాటు పలువురు నేతలు హస్తం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ… రాష్ట్రంలో బీఆర్ఎస్‌ను ఓడించడం కాంగ్రెస్ పార్టీకే సాధ్యమన్నారు. వికారాబాద్ ప్రజలు తనను ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించారని, ఈసారి తాను జహీరాబాద్ నుండీ పోటీలో ఉంటున్నట్లు స్పష్టం చేశారు. బీజేపీ సభకు శాలువా తీసుకువెళ్తే దళితుడినని అమిత్ షా తీసుకోలేదన్నారు. డెబ్బై ఏళ్ల తర్వాత కూడా అసమానత్వం ఉందని వాపోయారు.