ఈ నెల 17న చిలకలూరిపేట వద్ద ప్రధాని నరేంద్ర మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ హాజరైన ప్రజాగళం సభలో భద్రతా వైఫల్యాలు చోటుచేసుకున్నాయంటూ టీడీపీ నేత దేవినేని ఉమా ధ్వజమెత్తారు. ప్రధాని నరేంద్ర మోదీ హాజరైన సభలో క్రౌడ్ మేనేజ్ మెంట్ బాధ్యత ఎవరిది? అని సూటిగా ప్రశ్నించారు. ప్ర

జాగళం సభలో భద్రతా వైఫల్యంపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రధాని పాల్గొన్న సభ భద్రత పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసు ఉన్నతాధికారులపై ఎన్నికల సంఘం తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.