ఆంధ్రప్రదేశ్ లోక్ సభ, శాసనసభలో ఎవరెవరు? అనే పుస్తకాన్ని మారిశెట్టి మురళీమోహన్ రచించారు. ఈ పుస్తకాన్ని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మంగళగిరి జనసేన కేంద్ర కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆవిష్కరించారు. 

ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్థానాల నుంచి, రాష్ట్రంలోని లోక్ సభ స్థానాల నుంచి 1952 నుంచి 2019 వరకు ఎన్నికైన ప్రజా ప్రతినిధుల పేర్లు, ఆయా స్థానాల్లో సామాజిక సమీకరణాలు, ఏ పార్టీ ఎన్నిమార్లు గెలుపు సాధించింది అనే వివరాలతో ‘ఆంధ్రప్రదేశ్ లోక్ సభ, శాసనసభలో ఎవరెవరు?’ అనే పుస్తకాన్ని గ్రంథస్తం చేశారు. 

ఆవిష్కరణ కార్యక్రమం సందర్భంగా పుస్తక రచయిత మారిశెట్టి మురళీమోహన్ ను పవన్ కల్యాణ్ అభినందించారు. ఆంధ్రప్రదేశ్ లోక్ సభ, శాసనసభలో ఎవరెవరు? పుస్తకం రాజకీయాలపై ఆసక్తి ఉన్నవారికి, రాజకీయ రంగంలో ఉన్నవారికి ఉపయుక్తంగా ఉంటుందని కొనియాడారు.