విశాఖ జిల్లా పెందుర్తిలో కోటగిరి వరలక్ష్మి అనే వృద్ధురాలు వాలంటీర్ వెంకట్ చేతిలో గత నెలలో హత్యకు గురికావడం తెలిసిందే. బంగారు నగల కోసం ఆ వాలంటీర్ వృద్ధురాలిని హత్య చేసినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో, వరలక్ష్మి కుటుంబ సభ్యులను జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నేడు పరామర్శించారు. పెందుర్తి నియోజకవర్గంలోని సుజాత నగర్ లో ఉన్న వరలక్ష్మి నివాసానికి పవన్ వెళ్లారు. అక్కడ వరలక్ష్మి చిత్ర పటానికి నివాళులు అర్పించారు. విషాదంలో ఉన్న ఆ వృద్ధురాలి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ పర్యటనలో పవన్ వెంట జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు. 

Previous articleరేవంత్ రెడ్డికి రైతులే బుద్ధి చెపుతారు….
Next article డబ్బులతో గెలిచిన ఎంపీలు ఇలానే దద్దమ్మల్లా ఉంటారు: పవన్ కల్యాణ్