మాజీ ఎమ్మెల్యే కుర్ర సత్యనారాయణ సీ.ఎం కేసీఆర్ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రతిపాదించడంపై బి.ఆర్.ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు, మున్సిపల్ కౌన్సిలర్ వి.చంద్రారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. శనివారం పటాన్చెరువు పట్టణంలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కుర్ర సత్యనారాయణకి పుష్పగుచ్చం అందజేసి ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్సీ’గా ప్రతిపాదించడంపై సీ.ఎం కేసీఆర్ కి చంద్రారెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బి.ఆర్.ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గోపాల్ రెడ్డి మహేష్ యాదవ్ , బి.ఆర్.టి.యు కార్మిక నాయకులు వి.వరప్రసాద్ రెడ్డి , చిన్నా, తదితరులు పాల్గొన్నారు.

Previous articleసుప్రీంకోర్టు తీర్పు తర్వాత రాహుల్ గాంధీని అభినందించిన ఆర్జేడీ చీఫ్
Next article6-8-2023TODAY E-PAPER