జనసేన అధినేత , ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవ తీసుకుని మిస్సింగ్ గర్ల్ కేసును సాల్వ్ చేశారు. కాగా పవన్ కళ్యాణ్ చొరవతో దాదాపు 9 నెలల తర్వాత యువతి మిస్సింగ్ కేసును విజయవాడ పోలీసులు చేధించారు. తమ కూతురు కనిపించటం లేదంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు యువతి తల్లి పిర్యాదు చేయగా ఈ విషయాన్ని ఆయన సీరియస్ గా తీసుకున్నారు. సీఐ కి ఫోన్ చేసి యువతి మిస్సింగ్ విషయం పై స్వయంగా మాట్లాడాడు. దీనితో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు విజయవాడ యువకుడితో కలిసి జమ్మూలో ఉన్నట్టు గుర్తించారు. జమ్మూ నుండి స్పెషల్ పోలీస్ టీం ఇద్దరినీ విజయవాడ తీసుకొస్తున్నట్టు సమాచారం. వివరాల్లోకి వెళ్తే విజయవాడలో చదువుకుంటున్న తమ కుమార్తె మైనర్ అని , ప్రేమ పేరుతో ట్రాప్ చేసి కిడ్నాప్ చేశారని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన శివ కుమారి పవన్ కళ్యాణ్ ని కలిసి కన్నీటి పర్యంతమైంది. మాచవరం పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసినా, తమ కుమార్తె జాడ తెలిసినా పోలీసులు స్పందించటం లేదని వాపోయింది. దీని పై వెంటనే స్పందించిన పవన్ కళ్యాణ్ మాచవరం సీఐ కి ఫోన్ చేసి కేసు వివరాలు తెలుసుకుని వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీనితో రంగంలోకి దిగిన బెజవాడ పోలీసులు కేసులో పురోగతి సాధించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జోక్యంతోనే పోలీసులు ఈ కేసును చేధించగలిగారని అందరూ అభిప్రాయపడుతున్నారు.