పల్లవి ప్రశాంత్ తన అద్భుత ప్రతిభతో బిగ్ బాస్-సీజన్ 7 తెలుగు విజేతగా నిలిచాడు. అయితే అతనికి రైతుబిడ్డ ట్యాగ్ ఎంతగానో ఉపయోగపడింది. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన యువకుడు బిగ్ బాస్ గదిలో సెలబ్రిటీలకే చుక్కలు చూపించాడు. ఇది ప్రేక్షకులను అలరించింది. తాను రైతుబిడ్డనని పల్లవి ప్రశాంత్ చెప్పుకున్నాడు. రైతుబిడ్డనంటూ సింపతీ గేమ్ ఆడుతున్నాడని ఇతర కంటెస్టెంట్స్ చెప్పినప్పటికీ… తన ఐడెంటింటీ అదేనని.. తాను చేసే పనిని చెబితే తప్పేమిటని పల్లవి ప్రశాంత్ గట్టిగా సమాధానం చెప్పాడు. అలాంటి పల్లవి ప్రశాంత్… ఇన్‌స్టాగ్రామ్‌‌లో తన పేరు నుంచి రైతు బిడ్డ ట్యాగ్ ను తీసేశాడు. ‘మల్ల వొచ్చినా’, బిగ్ బాస్ తెలుగు 7 టైటిల్ విన్నర్, స్పై టీమ్ విన్నర్’ అని తన ఇన్‌స్టా పేరును మార్చారు.