• వివాదస్పద భూముల్లో అక్రమ నిర్మాణాలు
  • కోట్ల విలువగల ప్రభుత్వభూమి మాయం
  • మద్దతుగా నిలుస్తున్న రెవెన్యూ జిహెచ్ఎంసి అధికారులు
  • సర్వేనెంబర్ 44 లో అంతా ఆయనదే హవా
  • అధికారులను అనుకూలంగా మార్చుకొని అక్రమ నిర్మాణాల జోరు

శేరిలింగంపల్లి మియాపూర్ పవర్ ఆఫ్ జర్నలిజం : శేరిలింగంపల్లి మండలం మియాపూర్ డివిజన్ పరిధిలో గల సర్వే నంబర్ 44, 44/1 లో బికే ఎన్ క్లేవ్ మరియు శ్రీ సాయి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ వివాదస్పద భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. శేరిలింగంపల్లి మండలం మియాపూర్ డివిజన్ పరిధిలోని సర్వే నంబర్ 44, 44/1లో ప్రభుత్వ భూమి ఉంది. దాన్ని కాపాడేందుకు రెవెన్యూ, జిహెచ్ఎంసి అధికారులు విఫలమయ్యారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో అక్రమ నిర్మాణాల జోరు పెరిగింది.

 కోట్లు రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూములను రెవెన్యూ మరియు జిహెచ్ఎంసి అధికారుల, ప్రజాప్రతినిధుల అండదండలతో అక్రమార్కులు దర్జాగా నిర్మాణాలు చేస్తున్నారు. భవనాలు నిర్మించి ఎంచక్కా అమ్మేసుకొని సొమ్ము చేసుకుంటున్నారు. ఆ భూములను కాపాడాల్సిన రెవెన్యూ, జిహెచ్ఎంసి అధికారులు మాత్రం చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు.  కోట్ల రూపాయలు విలువచేసే 44, 44/1 సర్వే నెంబరు లో ఉన్న ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నప్పటికీ రెవెన్యూ, జిహెచ్ఎంసి అధికారులు చాలా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు ఇక్కడ ఉన్న ప్రభుత్వ భూమిలో చాలావరకు నిర్మాణాలు వెలిసాయి. అయినప్పటికీ ఇంకా కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూములు ఈ సర్వే నెంబర్లో ఉన్నాయి. వీటిని రక్షించుకోవాల్సిన అధికారులు కేవలం నోటి మాటతో ప్రభుత్వ భూమిలో నిర్మాణాలను చేపట్టకూడదంటూ చెప్పేసి పనులు ఆపించేశామంటూ చెప్పుకోస్తున్నారు. కానీ తిరిగి నిర్మాణాలు యదావిధిగా కొనసాగుతున్న నేపద్యంలో అధికారులు చాలా ఉదాసీనతతో వ్యవహరించడంతోనే ఈ విధంగా జరుగుతుందని అధికారుల తీరును ప్రజలు దుయ్యబడుతున్నారు.

ప్రభుత్వ భూమిలో ప్రైవేటు పాగా

44, 44/1 సర్వే నెంబర్‌ ల భూమాపై 2022 లో తెలంగాణ హై కోర్ట్ కూడా ప్రభుత్వాభూమిగా తీర్పు ఇచ్చినప్పటికి అక్రమార్కులు తగ్గేదెలే అంటూ వ్యవహరిస్తున్నారు. మరికొందరు దీనిపై సుప్రీం కోర్ట్ ను ఆశ్రయించడంతో ప్రస్తుస్థానికి యెటువంటి నిర్మాణాలు నిర్మించకూడదని ఆదేశాలున్నపట్టికి నిర్మాణాల జోరు తగ్గలేదు.  స్థానిక ప్రజాప్రతినిధులు, కూడా నోరు మెదపకపోవడం పట్ల పలు అనుమానాలు కలుగుతున్నాయి. అధికార పక్షంతో పాటు ప్రతిపక్ష పార్టీలు కూడా ప్రభుత్వ భూముల అన్యాక్రాంతంతో భాగస్వాములుగా నిలిచినట్లు సమాచారం. అందుకే వారెవరూ ఈ భూములను కాపాడేందుకు ముందుకు రావడం లేదంటున్నారు.  

మద్దతుగా నిలుస్తున్న రెవెన్యూ జిహెచ్ఎంసి అధికారులు – అందరికీ ముడుపులు

హైటెక్స్ కు కుతవేటు దూరంలో ఉండటంతో అత్యంత ఖరీదైన ఈ భూమిని కాపాడడంలో రెవెన్యూ, జిహెచ్ఎంసి యంత్రాంగం విఫలమైనట్లు తెలుస్తోంది. అక్రమార్కులపై చర్యలు చేపట్టాలని సూచించిన ప్రభుత్వ అధికారులు పెడచెవిన పెట్టారని, అందుకే ఆ భూమి అదృశ్యమవుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. 44,44/1, 100, 101 సర్వే నెంబర్లలో పలు నిర్మాణాలు జరుగుతున్నా ఆ నిర్మాణాలపై పలువురు ఫిర్యాదు చేసిన అటు రెవెన్యూ కానీ ఇరిగేషన్ కానీ హెచ్‌ఎం‌డి‌ఏ అధికారులు తో సహ ఎవ్వరూ పట్టించుకోకపోవటం పలు అనుమానాలకు దారి తీస్తుంది. ముఖ్యంగా బి‌కే ఎన్ క్లేవ్, శ్రీ సాయి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ లో ఆర్‌ఐ పేరు వినిపించడం గమనార్హం. ఇక్కడ షెడ్స మరియు బుల్డింగ్ ల పై పలుమార్లు ఆర్‌ఐ కు కంప్లెంట్స్ వచ్చిన చూసి చూడనట్టు వ్యవహరించడం కూడా ఒక కారణంకావొచ్చు .

సర్వేనెంబర్ 44 లో అంతా ఆయనదే హవా

వివాదస్పద భూముల్లో ఎటువంటి అనుమతులు లేకున్నా మున్సిపల్ చైన్మెన్ లను అటు రెవెన్యూ  అధికారులను తనకు అనుకూలంగా మార్చుకుని  ఎంత అడిగితే అంత డబ్బును ఇస్తూ బికే ఎన్ క్లేవ్ మరియు శ్రీ సాయి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ లలో ఓ బిల్డర్ సుమారుగా 5కు పైన అక్రమంగా నిర్మాణాలు నిర్మిస్తున్నాడు. తను నిర్మిస్తు పక్క వారికి నేనున్నా అధికారులను చూసుకుంటా మీరు ఎన్ని అంతస్తులైన కట్టుకోండి అంటూ వారిదగ్గరకుడా  వసూల్లకు పాల్పడుతున్నాడు.