ప్రయత్నిస్తూ ఉంటే అనుకున్న రంగంలో ఎదో ఒకరోజు విజయం సాధిస్తారు. అసలు ప్రయత్నమే చేయకపోతే ముందు మీ కోసం ఎదురు చూస్తున్న విజయాన్ని కూడా మీరు చేజారిపోతారు. ప్రపంచంలోని అనేక మంది వ్యక్తులు ప్రయత్నిష్టిస్తే విజయం కచ్చితంగా వరిస్తుందని నిరూపించారు. అందులో ఒకరే ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి ..ఆయనే జై చౌదరి. .అత్యంత పేద కుటుంబంలో జై చౌదరి జన్మించారు ..ఆయన చిన్నతనంలో అనేక కష్టాలను అనుభవించారు. పేద వాళ్లైనా వారి ఇంట్లో కరెంటు, నీరు వంటి కనీస సౌకర్యాలు కూడా ఉండేవి కావు . అయినా ఆ స్థాయి నుంచి కష్టపడి..ఇవాళ ఓ ఉన్నతస్థాయిలో ఉన్నారు జై చౌదరి. ఎక్కడో భారత్ లోని ఓ మారుమూల గ్రామంలో జన్మించిన జై చౌదరి..ఇవాళ వేల కోట్ల రూపాయలు సంపాదించి ఓ టాప్ కంపెనీకి అధినేతగా ఉన్నారంటే దానికి ఆయన పడిన శ్రమే కారణం . పేదింటి స్థాయి నుండి ఈనాటి ఉన్నత శిఖరాలకు వెళ్లిన ఆయన సక్సెస్ స్టోరీ ఎంతోమంది యువతకు ఆదర్శప్రాయం . ప్రస్తుత హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఉనా జిల్లాలోని పనోహ్ గ్రామంలోని సన్నకారు రైతు కుటంబంలో 1958లో జై చౌదరి జన్మించారు. అతని బాల్యం కడు పేదరికంలో గడిచింది. జై చౌదరికి యుక్త వయస్సు వచ్చే దాకా పనోహ్ గ్రామంలో నీటి,కరెంట్ సౌకర్యాలు కూడా లేవు. జై చౌదరి స్కూల్ కి వెళ్లేందుకు పక్క గ్రామం దుసరా వరకు ప్రతిరోజూ 4 కి.మీ నడుచుకుంటూ వెళ్లేవాడు. తమ ఇంట్లో కరెంట్ సౌకర్యం లేకపోవడంతో ఆయన ఆరుబయట కూర్చొని వెన్నెల వెలుతురులో చుదువుకునేవాడు. అయితే ఎన్ని కష్టాలు ఎదురైనా జై చౌదరిలో ఏ మాత్రం ఆత్మవిశ్వాసం తగ్గలేదు.. అధైర్యం అన్నదే దరి చేరనీయలేదు. తన జీవితంలో ఏదైనా సాదించాలనే లక్ష్యంతో చదువుపైనే శ్రద్ధ పెట్టాడు. అనేక కష్టాలను అనుభవిస్తూ ఎలాగోలా ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. తర్వాత IIT పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో అడ్మిషన్ సంపాదించాడు. ఆ తరువాత BHUలో ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేశాడు జై చౌదరి . చదువులో టాప్ లో కొనసాగుతూ అందివచ్చిన అన్ని అవకాశాలను అందిపుచ్చుకునేవాడు. ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌ కంప్లీట్ అవగానే హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుంచి మార్కెటింగ్ మేనేజ్‌మెంట్ చదివారు. ఆ తర్వాత జై చౌదరి సెక్యూర్‌ఐటి, సైఫర్ ట్రస్ట్ వంటి కంపెనీలను ప్రారంభించారు. వ్యాపారంలో లాభాలు రావటంతో అతను ఎయిర్ డిఫెన్స్, కోర్ హార్బర్ వంటి వ్యాపార సంస్థలను కూడా ప్రారంభించాడు. ప్రస్తుతం Zsclaer కంపెనీ CEO,ఛైర్మన్ గాజై చౌదరి ఉన్నారు. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే అమెరికాలో నివసిస్తున్న అత్యంత సంపన్న భారతీయ వ్యాపారవేత్తగా జై చౌదరి నిలిచారు. ప్రస్తుతం అతని సంపద మొత్తం విలువ 91 వేల కోట్లకు పైనే ఉంటుంది. కష్టపడితే ఏదైనా సాధ్యమే అని నిరూపించిన జై చౌదరి ఎందరికో ఆదర్శప్రాయం అనటంలో ఎలాంటి సందేహం లేదు.