గత కొన్ని వారాలుగా సమ్మె చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు, సహాయక సిబ్బందిపై ఏపీ ప్రభుత్వం ఎస్మా చట్టం ప్రయోగించడం తెలిసిందే. దీనిపై టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగం నియంత పోకడలకు పరాకాష్ఠ అని విమర్శించారు. ఇచ్చిన హామీలు అమలు చేయాలని నిరసనలు చేయడం కూడా నేరమా? అని ప్రశ్నించారు. 

ఎస్మా ప్రయోగం, జీతంలో కోత నియంత పోకడలకు ప్రబల నిదర్శనం అని పేర్కొన్నారు. తక్షణమే ప్రభుత్వం జీవో నెం.2ను వెనక్కి తీసుకోవాలని నారా లోకేశ్ డిమాండ్ చేశారు. అంతిమంగా నెగ్గేది అంగన్వాడీలేనని అన్నారు. ఏపీలో అంగన్వాడీల ఉద్యమానికి టీడీపీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు.