సీఎం జగన్ కు, వైసీపీ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం అనుకూలమనే అపవాదును తొలగించుకోవాలని బీజేపీ అగ్ర నేతలు యోచిస్తున్నారని వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవ వేడుక అనంతరం రాష్ట్ర ప్రజలు శుభవార్తను వింటారని చెప్పారు. జగన్ ప్రభుత్వం ఎన్నో తప్పులు చేసిందని, ఆ తప్పులను తీవ్రంగా ఖండించాలని బీజేపీ నేతలు నిర్ణయించారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి వెళ్లాలని తాను ఆశిస్తున్నానని చెప్పారు. సీపీఎస్ ను రద్దు చేయాలని మహారాష్ట్రలోని బీజేపీ, శివసేన ప్రభుత్వం నిర్ణయించిందని రఘురాజు తెలిపారు. ఏపీలో టీడీపీ, జనసేనతో కలిసి బీజేపీ ముందుకు సాగనుండటంతో… ఓపీఎస్ కోసం రాష్ట్ర ఉద్యోగులంతా ఈ కూటమికి మద్దతుగా నిలవాలని కోరారు