సీనియర్ నటుడు చంద్రమోహన్ మృతితో తెలుగు చలనచిత్ర పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యం, వృద్ధాప్య సంబంధ సమస్యలతో బాధపడుతున్న చంద్రమోహన్ హైదరాబాదు అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. చంద్రమోహన్ మృతి పట్ల అగ్రనటుడు మోహన్ బాబు భావోద్వేగాలతో స్పందించారు. మోహన్ బాబు ప్రస్తుతం ‘కన్నప్ప’ చిత్రం షూటింగ్ కోసం న్యూజిలాండ్ లో ఉన్నారు. చంద్రమోహన్ మరణవార్త తెలియగానే తీవ్ర విచారానికి గురయ్యానని వెల్లడించారు. ఈ మేరకు ఓ వీడియో సందేశం వెలువరించారు.  “1966లో నేను కాలేజీలో చదువుతున్న రోజులవి. ఆ సమయంలో చంద్రమోహన్ నటించిన రంగులరాట్నం చిత్రం రిలీజైంది. ఆ సినిమా నాకు ఎంతగానో నచ్చింది. అప్పట్నించి చంద్రమోహన్ అంటే అభిమానం. ఆ తర్వాత నేను సినిమాల్లోకి వచ్చాను.