తెలంగాణ మంత్రి మల్లారెడ్డి స్టైయిలే వేరు. ఆయన ఏది చేసినా ప్రత్యేకంగా ఉంటుంది. జనాలను విశేషంగా అకట్టుకుంటుంది. తాజాగా ఆయన మరోసారి వార్తల్లోకి ఎక్కారు. వివరాల్లోకి వెళ్తే… మేడ్చల్ మున్సిపల్ పరిధిలో మల్లారెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన ఒక పని చర్చనీయాంశంగా మారింది. గౌరమ్మ అనే వృద్ధ మహిళను చంటి పిల్లలా తన ఒడిలో కూర్చోబెట్టుకుని, తనకు ఓటు వేయాలని అడిగారు. దీంతో అక్కడున్న వారంతా నవ్వుల్లో మునిగిపోయారు. మరోవైపు, 18వ వార్డులో వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు బీఆర్ఎస్ లో చేరారు. వారందరికీ మల్లారెడ్డి స్వాగతం పలికారు.

Previous articleకామారెడ్డి మాస్టర్ ప్లాన్ ప్రతిపాదనను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన మంత్రి కేటీఆర్
Next article పవన్ కల్యాణ్ కంటే నేనే బెటర్ అని వైసీపీ ఎంపీ చెప్పారు: కేఏ పాల్