కాంగ్రెస్ పార్టీ భుజం మీద గొడ్డలి ఉందని… వారికి అధికారం ఇస్తే వేటు వేయడం ఖాయమని ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ అన్నారు. బుధవారం సత్తుపల్లిలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ… కాంగ్రెస్ నేతలు రైతుబంధు దుబారా అంటున్నారని, రైతులకు సాయం చేసే రైతుబంధు ఇవ్వవద్దా? అని ప్రశ్నించారు. తాము అధికారంలోకి వస్తే ధరణి తీసేస్తామని రాహుల్ గాంధీ చెబుతున్నారని, అసలు ఆయనకు ఏం తెలుసు? అని ప్రశ్నించారు. ధరణి వచ్చాక ఒకరి భూములు ఇంకొకరికి బదిలీ కావడం ఆగిపోయిందన్నారు. గ్రామాలు హాయిగా ఉంటున్నాయన్నారు. రైతుల కష్టాలు రాహుల్ గాంధీకి తెలుసా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ వస్తే దళారుల రాజ్యమే అన్నారు.