సంగారెడ్డిలో బీఆర్ఎస్ రైతు దీక్ష‌లో పాల్గొన్న గులాబీ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హ‌రీశ్‌రావు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై ధ్వ‌జ‌మెత్తారు. మొద్దు ప్ర‌భుత్వాన్ని నిద్ర‌లేప‌డానికి రైతు దీక్ష‌లు చేస్తున్న‌ట్లు పేర్కొన్నారు. క‌రెంటు లేదు, నీళ్లు లేవు కేవ‌లం క‌న్నీళ్లే మిగిలాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. 

పంట న‌ష్ట‌పోయిన రైతుల‌కు ప్ర‌భుత్వం ఎక‌రానికి రూ. 25 వేలు ఇవ్వాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. అలాగే చ‌నిపోయిన అన్న‌దాత‌ల కుటుంబాల‌కు రూ. 20 ల‌క్ష‌లు ఇవ్వాల‌న్నారు. రైతుల‌కు ఇచ్చిన హామీల‌ను కాంగ్రెస్ నిల‌బెట్టుకోవాల‌ని హ‌రీశ్‌రావు చెప్పారు.