తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ సూర్యాపేటలో పర్యటించారు. ఆయన పలు ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నారు. నూతనంగా నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ వైద్య కళాశాలను రూ.156 కోట్ల వ్యయంతో నిర్మించారు. పట్టణంలో కొత్తగా నిర్మించిన ఇంటిగ్రేటెడ్ వెజ్-నాన్ వెజ్ మార్కెట్ ను కూడా ప్రారంభించారు. ఈ సమీకృత శాకాహార, మాంసాహార మార్కెట్ ను రూ.30 కోట్ల వ్యయంతో నిర్మించారు. సూర్యాపేటలో తన పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి, జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ కు ప్రారంభోత్సవం చేశారు. సూర్యాపేట జిల్లా ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ భవనాన్ని కూడా ప్రారంభించారు.