డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం మలికిపురం గ్రామంలో జనసేన ఎంపీటీసీ జక్కంపూడి విజయలక్ష్మి శ్రీనివాస్ కుమారుడు వినూత్నంగా ఆలోచించాడు. తనకు పవన్ కళ్యాణ్ పై ఉన్న అభిమానాన్ని ప్రదర్శించేందుకు ఏదో ఒకటి చేయాలనుకున్నాడు. అదే సమయంలో పవన్ వారాహి యాత్ర ప్రారంభించారు. దీంతో పవన్ కు వారాహి పోలికలతో ఓ చిన్న వాహనం తయారు చేసి ఇస్తే ఎలా ఉంటుందని ఆలోచించాడు.ఆ బుడతడు ఈ మినీ వారాహిని తయారు చేయడానికి సుమారు 10 రోజులు సమయం పట్టింది. దీనిని పవన్ కళ్యాణ్ మీద ఉన్న అభిమానంతో ఆయనకు బహుమతిగా ఇవ్వటం కోసం తయారు చేశానని బాలుడు తెలిపాడు.

Previous articleవాలంటీర్ల వ్యవస్థపై సంచలన వ్యాఖ్యలు
Next articleఇది రాష్ట్రమా.. రావణకాష్ఠమా : చంద్రబాబు