సీఎం జగన్ పై టీడీపీ మాజీ ఎమ్మెల్సీ జి. దీపక్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జగన్ రికార్డు స్థాయిలో మాట తప్పి మడమ తిప్పారని విమర్శించారు. జగన్ ఇచ్చిన 730 హామీల్లో 621 హామీలు అంటే 85 శాతం పూర్తి చేయలేదని అన్నారు.

“నేను ఉన్నాను, విన్నాను అంటూ గతంలో ఎన్నికల ముందు ప్రచారం చేశారు. 5 ఏళ్ల వరకు జగన్ రెడ్డికి వినపడలేదు, కనపడలేదు. మాట తప్పను, మడమ తిప్పను అని చెప్పి మాట తప్పి, మడమ తిప్పడంలో సరిలేరు జగన్ కు సాటి అనే విధంగా 5 ఏళ్ల పాలన సాగించారు. ఎన్నికల ముందు ముద్దులు పెట్టుకుంటూ తిరిగి ఇప్పుడు గుద్దులు గుద్దుతున్నారు. మ్యానిఫెస్టో బైబిల్, ఖురాన్, భగవద్గీత అని చెప్పి ఒక్క హామీని నెరవేర్చలేదు” అని దీపక్ రెడ్డి విమర్శించారు.