రానున్న ఎన్నికల్లో పోటీ చేసే ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల జాబితాను వైసీపీ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇడుపులపాయలో తన తండ్రి సమాధి వద్ద నివాళి అర్పించిన అనంతరం… అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. జాబితాలో పలువురు అభ్యర్థులకు స్థాన చలనం కలిగింది. మరోవైపు వైసీపీ ఎన్నికల జాబితాపై టీడీపీ యువనేత నారా లోకేశ్ సెటైర్లు వేశారు. మునిగిపోతున్న పడవలోకి ఎక్కుతున్న ప్యాసింజర్ల జాబితాను జగన్ విడుదల చేశారని ఎద్దేవా చేశారు.