ముద్రగడ పద్మనాభం కాపు నేతగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. అయితే ఆయన తాజాగా వైసీపీలో చేరిన విషయం తెలిసిందే. జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన ముద్రగడ పద్మనాభం .ఆ మరుక్షణం నుంచే పక్కా వైసీపీ నేతగా మారిపోయారు. వైసీపీలోని ఇతర నేతల కంటే ఎక్కువగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఆయన టార్గెట్ చేస్తున్నారు. పిఠాపురం నుంచి పవన్ ను తరిమేయకపోతే తన పేరును మార్చుకుంటానని ఆయన సవాల్ విసిరారు. ఈ విషయంలో ఆయన కూతురు క్రాంతి ముద్రగడకు భారీ షాక్ ఇచ్చారు. తన తండ్రి చేస్తున్నది కరెక్ట్ కాదని ఆమె స్పష్టం చేశారు. తాను పవన్ గెలుపు కోసం కృషి చేస్తానని చెప్పారు. ఈ క్రమంలో ఆమె ఒక వీడియో విడుదల చేశారు. “తన పేరు క్రాంతి అని తాను ముద్రగడ పద్మనాభం గారి అమ్మాయినని , పిఠాపురంలో వపన్ కల్యాణ్ గారిని ఓడించేందుకు వైసీపీ నాయకులు ఎన్ని చేయాలో అన్నీ చేస్తున్నారని ఆ వీడియోలో తెలిపారు . ఇంకా ముఖ్యంగా తన తండ్రి ఒక బాధాకరమైన ఛాలెంజ్ చేశారని, . పవన్ కల్యాణ్ ను ఓడించి… పిఠాపురం నుంచి తన్ని తరిమేయకపోతే ఆయన పేరును ముద్రగడ పద్మనాభంరెడ్డిగా మార్చుకుంటానన్నారని , ఈ కాన్సెప్ట్ ఏమిటో తనకు అస్సలు అర్థం కాలేదన్నారు . ఆయన ప్రకటన ముద్రగడ అభిమానులకు కూడా నచ్చలేదని , వంగా గీత గారిని గెలిపించడానికి కష్టపడొచ్చు గాని , పవన్ కల్యాణ్ ని, ఆయన అభిమానులను కించపరిచేలా కామెంట్స్ ఉండకూడదని ఆమె అన్నారు . కేవలం పవన్ కల్యాణ్ ని తిట్టడానికే తన తండ్రిని జగన్ వాడుతున్నారని , ఈ ఎన్నికల తర్వాత మా నాన్నను ఎటూ కాకుండా వదిలేయడం పక్కా అని . ఈ విషయంలో తాను మా నాన్నగారిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నానని , పవన్ కల్యాణ్ గెలుపు కోసం తన వంతు కృషి చేస్తానని ” వీడియో ద్వారా క్రాంతి వెల్లడించారు.