తెలంగాణ ప్రభుత్వం 23 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతికుమారి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. సాంకేతిక సర్వీసుల అదనపు డీజీపీగా వీవీ శ్రీనివాసరావును నియమించింది. పోలీసు నియామక బోర్డు చైర్మన్‌గా ఆయనకు అదనపు బాధ్యతలను అప్పగించింది. కో-ఆర్డినేషన్ డీఐజీగా గజరావు భూపాల్, మహిళా భద్రతా విభాగం డీఐజీగా రెమా రాజేశ్వరి, రాజేంద్ర నగర్ డీసీపీగా సీహెచ్ శ్రీనివాస్, హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ-3గా ఆర్ వెంకటేశ్వర్లు, రామగుండం సీపీగా ఎల్ ఎస్ చౌహాన్, ఎల్బీ నగర్ డీసీపీగా సీహెచ్ ప్రవీణ్ కుమార్, టీఎస్ ట్రాన్సుకో ఎస్పీగా ఉదయ్ కుమార్ రెడ్డి, మాదాపూర్ డీసీపీగా జీ వినీత్‌లకు బాధ్యతలు అప్పగించారు.