iiit basar latest news
iiit basar latest news

మృతురాలి పేరు బూర లిఖిత. బాసర రాజీవ్ గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీలో పీయూసీ ప్రథమ సంవత్సరం విద్యార్థిని. సిద్ధిపేట్ జిల్లా గజ్వేల్ ఆమె స్వస్థలం. ఈ తెల్లవారుజామున 2 గంటల సమయంలో హాస్టల్ భవనం నాలుగో అంతస్తు నుంచి కిందపడి మరణించినట్లు చెబుతున్నారు. సెక్యూరిటీ గార్డ్, హాస్టల్ సిబ్బంది లిఖితను హుటాహుటిన భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు.అనంతరం మెరుగైన చికిత్స కోసం నిర్మల్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే లిఖిత మరణించినట్లు డాక్టర్లు ధృవీకరించారు. లిఖిత మృతిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. ఆమె కాలు జారి కిందపడి మరణించినట్లు వార్తలు వస్తోండగా.. బలవన్మరణానికి పాల్పడిందనే వాదనలు కూడా ఉన్నాయి. దీనిపై పోలీసులు ఇంకా స్పష్టత ఇవ్వాల్సి ఉంది.

Previous articleసువర్ణ భూమి సంస్థ స్కాం
Next articleసంజయ్ ను మార్చాలనే వార్తల్లో నిజం