ఏపీ రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటు చేసుకోబోతోంది. మాజీ మంత్రి, కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు హరిరామ జోగయ్య కుమారుడు సూర్యప్రకాశ్ జనసేనకు పెద్ద షాక్ ఇచ్చారు. జనసేన పీఏసీ పదవికి ఆయన రాజీనామా చేశారు. వైసీపీలో ఆయన చేరబోతున్నారు. ఆచంట అసెంబ్లీ నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జీగా ఆయన ఉన్నారు. అయితే, ఆచంట స్థానంలో టీడీపీ పోటీ చేస్తుండటంతో… నిడదవోలు టికెట్ ను జనసేన నుంచి ఆశించారు. అయితే, అక్కడ కూడా ఆయన పరిస్థితి ఆశాజనకంగా లేకపోవడంలో జనసేనకు గుడ్ బై చెప్పారు.  ఈ మధ్యాహ్నం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ను సూర్యప్రకాశ్ కలిశారు. కాసేపట్లో ఆయన వైసీపీలో చేరే అవకాశం ఉంది. మరోవైపు, పాలకొల్లు వైసీపీ ఇన్ఛార్జీగా సూర్యప్రకాశ్ ను నియమిస్తారనే ప్రచారం జరుగుతోంది.