టీడీపీ అధినేత చంద్రబాబు తాజా ఆరోగ్య బులెటిన్ ను రాజమండ్రి జైలు అధికారులు కొద్దిసేపటి కింద విడుదల చేశారు. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు చంద్రబాబును పరిశీలించి ఇచ్చిన వివరాల మేరకు ఈ బులెటిన్ రూపొందించారు. ఈ బులెటిన్ లో చంద్రబాబు ఖైదీ నెంబరుతో పాటు, ఆయనను రిమాండ్ ముద్దాయిగా పేర్కొన్నారు.  ఇక, బీపీ-130/80, శరీర ఉష్ణోగ్రత-నార్మల్, నాడి-64/మినిట్, శ్వాస-12/మినిట్, హార్ట్ రేట్-ఎస్1 , ఎస్2 , ఆక్సిజన్ శాచ్యురేషన్-గది వాతావరణం వద్ద 96 శాతం, ఊపిరితిత్తులు-క్లియర్, శారీరక క్రియాశీలత-బాగుంది, బరువు-67 కేజీలు అని వివరించారు.