స్కిల్ డెవలప్ మెంట్ కేసులో నిన్న బెయిల్ పై విడుదలైన టీడీపీ అధినేత చంద్రబాబు ఈరోజు హైదరాబాద్ కు వస్తున్నారు. రాజమండ్రి నుంచి సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఉదయం 6 గంటల సమయంలో ఆయన అమరావతిలోని ఉండవల్లి నివాసానికి చేరుకున్నారు. వాస్తవానికి ఆయన ఈరోజు తిరుమలకు వెళ్లి, శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవాల్సి ఉంది. అయితే, తిరుమల పర్యటనను ఆయన రద్దు చేసుకున్నారు. ఈ సాయంత్రం ఆయన నేరుగా హైదరాబాద్ కు రానున్నారు. 

చంద్రబాబు నేటి షెడ్యూల్:

  • మధ్యాహ్నం 3 గంటలకు – ఉండవల్లి నివాసం నుంచి బయల్దేరనున్న చంద్రబాబు
  • 3.45 గంటలకు – విజయవాడ ఎయిర్ పోర్టుకు చేరిక
  • 4.00 గంటలకు – శంషాబాద్ ఎయిర్ పోర్టుకు పయనం
  • 4.45 గంటలకు – హైదరాబాద్ చేరిక
  • 5 గంటలకు – ఎయిర్ పోర్టు నుంచి ఇంటికి పయనం
  • 5.50 గంటలకు – జూబ్లీహిల్స్ లోని నివాసానికి చేరుకోనున్న చంద్రబాబు