ఈ సారి ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగానే ముగిసినా అక్కడక్కడా హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్నికల్లో ఎన్నడూ లేనంత ఉత్కంఠ చెలరేగింది. ఇక పిఠాపురం నియోజకవర్గం అయితే హాట్ టాపిక్ గా మారిందనే విషయం తెలిసిందే. అయితే ఈ ఎన్నికల ఫలితాలు ఇప్పుడు ఈవీఎం లలో నిక్షిప్తమై ఉన్నాయి. జూన్ నాలుగున గెలిచిన పార్టీ సంబరాలు చేసుకోబోతోంది. అయితే కచ్చితంగా ఈ పార్టే గెలుస్తుందని చెప్పలేకపోతున్న కూటమికే గెలుపు అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.. ఈ ఎన్నికలలో కూటమికే గెలుపు అవకాశాలు ఉన్నట్టు రాజకీయ వ్యూహ కర్త ప్రశాంత్ కిశోర్ తో పాటు కొన్ని సర్వేలు కూడా చెబుతున్నాయి. ఈ ఎన్నికలలో యువత కూడా తమ ఓటు హక్కు వినియోగించటానికి ఆసక్తి చూపటంతో ఏపీలో పోలింగ్ శాతం కూడా పెరిగింది. ఓటింగ్ శాతం పెరిగిన ప్రతిసారి కొత్త ప్రభుత్వం వైపే ఓటర్లు మొగ్గు చూపినట్టు గత ఎన్నికల ఫలితాలు కూడా చెబుతున్నాయి. ఐతే ఈసారి పిఠాపురం నుండి బరిలోకి దిగిన పవన్ కళ్యాణ్ గెలుపు థత్యం అని అక్కడివారు అంటున్నారు. పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికలలో అహర్నిశలు కష్టపడ్డారు. ప్రజలకు దగ్గరయ్యారు. ఇక్కడ దాదాపు 90 వేయిలకు పైగానే కాపు ఓటర్లు ఉన్నారు. వీరంతా పవన్ కే మద్దతు తెలిపినట్టు మాజీ మంత్రి హరి రామ జోగయ్య తెలిపారు. ఇక తెలుగు సినీ ఇండస్ట్రీ కూడా పవన్ కు మద్దతు తెలిపింది. చాలామంది సినీ ప్రముఖులు పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురంలో ప్రచారంలో కూడా పాల్గొన్నారు.జన సైనికులు కూడా తమ వంతు కృషి చేశారు. అందుకే పిఠాపురం నుండి పవన్ గెలుపు సాధ్యమే అంటున్నారు. పిఠాపురంలో ఇప్పుడు సాగుతున్న చర్చ ఒక్కటే .. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మెజారిటీ ఎంత వస్తుంది అనే.. అయితే ఎన్నికలు ముగిశాక లక్ష మెజారిటీ పక్కా అన్న నియోజక వర్గ వాసులు ఇప్పుడు 10 నుండి 20 వేయిల మెజారిటీతో పవన్ గెలుస్తారు అంటున్నారు. ఏది ఏమైనా పిఠాపురంలో గెలుపోటములపైనా రోజు రోజుకు లెక్కలు మారుతున్నాయి. అధికార పార్టీ నుండి వంగా గీత బరిలో ఉండటం ఆమె కూడా కాపు నేత కావటంతో ఓట్లలో చీలిక వచ్చినట్లు కొత్తగా వార్తలు వినిపిస్తున్నాయి. పిఠాపురం నుండి ఆమె ఒకసారి ఎమ్మెల్యే గా ఉండటం , స్థానికురాలు కావటం వంగా గీతాలు ఏమైనా కలిసి వచ్చిందా అని కూడా అంటున్నారు. పిఠాపురంలో 90 వేయిల కాపు ఓట్లలో యూత్ మొత్తం పవన్ కళ్యాణ్ కె ఓటేసినట్టు తెలుస్తోంది. మధ్యవయసు , మరియు మహిళలు వంగా గీత వైపే మొగ్గు చూపారా అని అందరు అనుకుంటున్నారు .. అలా గనుక జరిగితే కాపుల ఓట్లలో చీలిక జరిగే అవకాశం ఉంది. ఇక మిగతా వర్గాలలోని ఓట్లు మాత్రం తమకే పడతాయని వైసీపీ భావిస్తోంది. కానీ అక్కడి ప్రజల మాట మాత్రం కచ్చితంగా ఈసారి పవన్ కళ్యాణ్ నే గెలుస్తాడని అంటున్నారు. మరి ఈ గెలుపోటములు తేలాలంటే జూన్ 4 వరకు ఆగాల్సిందే.