సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేతలు నేడు శాసనమండలి చైర్మన్ కు ఫిర్యాదు చేశారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, సురభి వాణీదేవి, ఎమ్మెస్ ప్రభాకర్ కలిశారు. ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సీఎం రేవంత్ అనుచిత వ్యాఖ్యలు చేశారని వారు ఆరోపించారు. శాసనమండలిని ఇరానీ కేఫ్ గా అభివర్ణించారని, మండలి సభ్యులను రియల్ ఎస్టేట్ బ్రోకర్లుగా చిత్రీకరిస్తూ వ్యాఖ్యలు చేశారని వారు పేర్కొన్నారు. ఈ మేరకు మండలి చైర్మన్ కు లిఖితపూర్వక ఫిర్యాదును అందజేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.