PJNews పటాన్ చెరు బొల్లారం మున్సిపల్ సి.ఐగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన గంగాధర్ ని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, మున్సిపల్ కౌన్సిలర్ వి.చంద్రారెడ్డి ఆధ్వర్యంలో పలువురు కౌన్సిలర్లు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చంద్రారెడ్డి తో కలిసి కౌన్సిలర్లు సీ.ఐను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. మున్సిపాలిటీలో శాంతి భద్రతల స్థాపనకు కృషి చేయాలని ఈ సందర్భంగా చంద్రారెడ్డి సి.ఐ’ని కోరారు. శాంతి భద్రతల పరిరక్షణలో తమ సంపూర్ణ సహకారం అందిస్తామన్నారు. మున్సిపాలిటీకి రావడం పై సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు గోపాలమ్మ, చంద్రయ్య, స్థానిక నాయకులు పి.లక్ష్మ రెడ్డి రెడ్డి, సంపత్ రెడ్డి , శ్రీధర్ రెడ్డి , రమణయ్య , మాజీ ఎం.పీ.టీ.సీ కృష్ణంరాజు , రాజ్ గోపాల్, చంద్రారెడ్డి, పరుశురాం, వెంకటయ్య , నర్సింహా రాజు , వెంకీ తదితరులు పాల్గొన్నారు.