తెలంగాణాలో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారెంటీలను అమలు చేసే దిశగా ద్రుష్టి పెట్టింది. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటోంది. దీనిలో భాగంగానే మొదట మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం.. ఆ తర్వాత ఆరోగ్య శ్రీ పరిధిని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచింది. ఇక 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ పథకం అమలు చేసిన కొన్ని రోజులకే 500 గ్యాస్ సిలిండర్ ను కూడా ప్రారంభించింది. తర్వాత మార్చి నెలలో సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభించారు. ఇప్పుడు మహాలక్ష్మి పథకంలో మరో ఉపపథకం పేద మహిళలకు 2500 ఇచ్చే కార్యక్రమాన్ని కూడా త్వరలో ప్రారంభించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధం అవుతోంది. లోక్ సభ ఎన్నికల కోడ్ సందర్భంగా కొత్త పథకాలను ప్రారంభించడానికి అవకాశం లేదు .. కోడ్ ముగిసిన వెంటనే ఈ పథకం ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ పథకానికి పూర్తి మార్గదర్శకాలు కూడా ఎన్నికల తర్వాత వెల్లడి కానున్నాయి. దీనికి కూడా రేషన్ కార్డు ను ప్రామాణికంగా తీసుకోనున్నారు. అర్హులైన ప్రతీ మహిళ ఖాతాల్లో నెలకు 2500 జమ కానున్నాయి. జూన్ నెలలో ఈ పథకం అమలు చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. రేషన్ కార్డులు లేని వాళ్లు మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తులు చేసుకోవచ్చు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారికి త్వరలోనే మంజూరు కానున్నాయి. రేషన్ కార్డులు వచ్చిన వెంటనే ఆరు గ్యారెంటీ పథకాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. రేషన్ కార్డులు లేని కారణంగా కొంతమంది ఉచిత కరెంట్ ,500 గ్యాస్ సిలిండర్ పథకాలకు అనర్హులుగా ఉన్నారు. వీరంతా రేషన్ కార్డులు వచ్చిన వెంటనే స్థానిక ఎమ్మార్వో లేదా మున్సిపాలిటీ సెంటర్లలో దరఖాస్తు చేసుకోవచ్చు . దీంతో పాటు.. రైతులకు 15,000 అందించే రైతుభరోసా పథకం కూడా వచ్చే వానాకాలం సీజన్ నుంచి ప్రారంభించనున్నట్టు సమాచారం . కౌలు రైతులు కూడా ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు.