హైదరాబాద్ లోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పై ఏసీబీ అధికారులు చాకచక్యంగా దాడులు నిర్వహించారు. ఈ దాడిలో ఎస్ఐ రంజిత్ రూ. 20 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులకు పట్టబడ్డారు. అలాగే రైటర్ విక్రమ్ను కూడా ఎసీబీ విచారిస్తుంది. . న్యాయం చేయాలి అంటూ పోలీసు స్టేషన్ కు వచ్చిన బాధితుడి వద్ద లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఏ ఎస్సె రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఓ సెక్టార్ ఎస్సైగా పనిచేస్తున్న రంజిత్ వద్దకు ఓ బాధితుడు ఇటీవల తనకు న్యాయం చేయాలంటూ వచ్చాడు. అయితే కొంత మొత్తంలో డబ్బులు ఇస్తేనే పని జరుగుతుందని తెలియజేశాడు. అప్పటికే కొంత మొత్తంలో డబ్బులు ముట్ట చెప్పిన బాధితుడు శనివారం మిగతా డబ్బులను ఎస్సై రంజిత్ సూచనల మేరకు రైటర్ విక్రమ్ కు ఇస్తుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఎస్సె రంజిత్, రైటర్ విక్రమ్ ను ఏసీబీ అధికారులు విచారిస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ ఆనంద్ తెలిపారు.