samantharuthprabhu
samantharuthprabhu

ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 13 ఏళ్లు గడుస్తోన్నా ఏమాత్రం తగ్గని క్రేజ్‌తో దూసుకుపోతోంది నటి సమంత. అనతి కాలంలోనే నటిగా అగ్ర స్థానానికి చేరుకుంది. సైత్‌ ఇండియాలో టాప్ హీరోయిన్లలో ఒకరిగా పేరు సంపాదించుకున్న ఈ బ్యూటీ.. పుష్పలో ఐటెం సాంగ్‌తో బాలీవుడ్‌ తళుక్కుమంది. అలాగే ఫ్యామిలీ మ్యాన్‌ వెబ్‌ సిరీస్‌తోనూ హిందీ ప్రేక్షకులను మెప్పించింది. దీంతో సామ్‌ పేరు బీ టౌన్‌లో మారుమోగింది.తాజాగా సిటడెల్‌ అనే వెబ్‌ సిరీస్‌లో నటిస్తోంది.

ప్రస్తుతం ఈ వెబ్‌ సిరీస్‌ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇండియాలో షూటింగ్‌ పూర్తి చేసుకున్న చిత్ర బృందం ఇప్పుడు విదేశాలకు వెళ్లింది. ఇదిలా ఉంటే హాలీవుడ్‌లో ఈ వెబ్‌ సిరీస్‌ లీడ్‌ రోల్‌లో ప్రియాంక చోప్రా నటించిన విషయం తెలిసిందే. ఇండియన్‌ వెర్షన్‌లో సమంత, వరుణ్‌ ధావన్‌ నటిస్తున్నారు. ఈ వెబ్‌ సిరీస్‌పై భారీగానే అంచనాలు ఉన్నాయి. ఇక ఇంతటి ప్రతిష్టాత్మక వెబ్‌ సిరీస్‌లో నటించేందుకు సామ్‌ తీసుకున్న రెమ్యునరేషన్‌కు సంబంధించి ఓ వార్త నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.సిటడెల్ వెబ్‌ సిరీస్‌ కోసం సమంత ఏకంగా రూ. 10 కోట్ల రెమ్యునరేషన్‌ తీసుకుందని టాక్‌ వినిపిస్తోంది. సాధారణంగా సౌత్‌ మూవీస్‌కు రూ. 4 నుంచి 5 కోట్లు తీసుకునే సమంత సిటడెల్‌ కోసం తన రెమ్యునరేషన్‌ను ఏకంగా డబుల్‌ చేసినట్లు సమాచారం.