శేర్లింగంపల్లి హఫీజ్ పెట్ పవర్ ఆఫ్ జర్నలిజం న్యూస్ ; హఫీజ్ పేట్ డివిజన్ లో సోమవారం రోజు సాయంత్రం కాంగ్రెస్ పార్టీ హత్ సే హాత్ జోడో విత్ రఘునాథ యాదవ్ కార్యక్రమాన్ని రాష్ట్ర యువ నాయకులు రఘునాథ్ యాదవ్ ఆధ్వర్యంలో సర్వే నెంబర్ 80 పరిసర ప్రాంతాల్లో పాదయాత్ర నిర్వహించారు. యాత్ర ప్రేమ్ నగర్, మార్తాండ నగర్, హనీఫ్ కాలనీ మొదలగు కాలనీల మీదుగా సాగింది. దేశంలోనే హైటెక్ నగరంగా చెప్పుకొని హైదరాబాద్, శేరిలింగంపల్లి నియోజకవర్గం అభివృద్ధి చూస్తే మాత్రం మాటలకే పరిమితమైందని స్థానిక ఎమ్మెల్యే అరికేపూడి గాంధీ సభల్లో చెప్పు మాటలకూ ప్రస్తుత వాస్తవానికి చాలా వ్యత్యాసం ఉందన్నారు. అభివృద్ధి పేరుతో చెరువులు, నాళాలు కబ్జాలు చేయడం వాటిపై ఉన్నా ద్యాస స్థానిక సమస్యలను గాలికి వదిలేసారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్షంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేసిన మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ స్ఫూర్తితో నేడు మన శేరిలింగంపల్లి నియోజకవర్గంలో హత్ సే హత్ జోడో విత్ రఘునాథ్ యాదవ్ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రజలనుంచి విశేష స్పందన లభించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాక్బుల్, సలీం, హమీద్, సలీం, భారత్ యాదవ్, రాజేష్ యాదవ్, కిరణ్ రెడ్డీ, యూసుఫ్, ముష్రాఫ్, జీవన్, పవన్ హనీఫ్, రషీద్, జావీద్, షరీఫ్, అఖిల్, సుకుమార్, అజయ్, నవీన్ మదన్ కుమార్, అరుణ్ పటేల్ మరియు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Previous article‘మోదీ’ వ్యాఖ్యలపై రాహుల్ కు రెండేళ్ల జైలు శిక్ష
Next article19-7-2023 TODAYE-PEPAR