ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి తీరు పట్ల ఉద్యోగ సంఘాలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాయి. అయితే వీరందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి తన దారికి తెచ్చుకున్నారు.ఉద్యోగ వర్గాలలో రేగిన అసంతృప్తిని కూడా జగన్ ప్రభుత్వం సద్దుమణిగేలా చేసింది. ఉద్యోగులకు ప్రీతికరమైన అనేక నిర్ణయాలను తీసుకుంది.ఇలా ఉద్యోగులకు వారి డిమాండ్లపరంగా అన్ని చేసినప్పటికీ ఓ వర్గం వారిలో మాత్రం కాస్త అసంతృప్తి నెలకొందని చెప్పాలి.

కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకాన్ని రద్దుచేసి ఉద్యోగులకు గరిష్ట ప్రయోజనం ఒనగూరే లాగా గ్యారంటీడ్ పెన్షన్ స్కీం తీసుకువస్తాం అని జగన్ సర్కారు చేసిన ప్రకటన విషయంలో ఉద్యోగులు కాస్త అసంతృప్తి గానే ఉన్నారని చెప్పాలి. అందుకే జిపిఎస్ లాంటి కొత్త పథకాలు ఏమీ వద్దని సిపిఎస్ ను రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని తిరిగి అమలులోకి తీసుకురావడం ఒక్కటే తమ సమస్యకు పరిష్కారం అని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు అయితే దీనిని ఆసరాగా చేసుకుని జనసేన పార్టీ వంచనకు సిద్ధమవుతోంది. సిపిఎస్ రద్దు కోరుతూ ఉమ్మడి జిల్లాల కలెక్టరేట్ల ఎదుట రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు శనివారం ఆందోళన చేపట్టారు అయితే ఈ నిరసనలో భాగంగా జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొన్నారు అయితే ఈ కార్యక్రమంలో నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేపిస్తున్న సమయంలో తాను అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సిపిఎస్ రద్దు చేస్తానని ప్రకటించారు.