జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర (varahi vijaya yatra)చేపట్టిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో పవన్ వారాహి యాత్ర సాగుతోంది. అయితే, పవన్ కళ్యాణ్ షెడ్యూల్ లో మార్పులు చేశారు. పవన్ కళ్యాణ్ మంగళవారం సాయంత్రం కాకినాడ నుంచి ముమ్మిడివరం వెళ్లనున్నారు.జూన్ 21న ముమ్మిడివరంలో పవన్ ఉదయం జనవాణి, సాయంత్రం బహిరంగ సభ నిర్వహించనున్నారు. జూన్ 22న పవన్ కళ్యాణ్ అమలాపురంలో జనవాణి ఏర్పాటు చేయనున్నారు. జూన్ 23న అమలాపురంలో వారాహి బహిరంగ సభ ఉంటుంది. అలాగే, జూన్ 24, జూన్ 25న పి గన్నవరం, రాజోలులో పవన్ వారాహి యాత్ర నిర్వహించనున్నారు. జూన్ 25న రాజోలు నియోజకవర్గం మలికిపురంలో బహిరంగ సభ జరగనుంది