టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఏజెంట్ అని, ఆయన తెలుగుదేశం పార్టీ ప్రోడక్టేనని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… రైతులను సంక్షోభంలోకి నెట్టివేసేందుకు కాంగ్రెస్ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. వారి పాలనలో పగటిపూట విద్యుత్ ఉండేదే కాదన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక రైతులకు నాణ్యమైన విద్యుత్ ను అందిస్తున్నామని, అయినప్పటికీ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. రైతులకు మూడు గంటల విద్యుత్ అని రేవంత్ చెప్పారని, దీనిని మేనిఫెస్టోలో పెట్టగలరా? అని నిలదీశారు. కాంగ్రెస్ ఎప్పటికీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదన్నారు. విద్యుత్‌పై రేవంత్ చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీని పాతాళంలోకి తీసుకు వెళ్ళాయన్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి చురకలు అంటించారు. రాహుల్ గాంధీ లీడర్ కాదని… ఆయన చూస్తూ చదివే రీడర్ అని ఎద్దేవా చేశారు.