నాగశౌర్య, యుక్తి తరేజా జంటగా నటించిన సినిమా ‘రంగబలి’. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న నాగశౌర్య ఈ సినిమాపై చాలా ఆశలే పెట్టుకున్నాడు. పవన్ బాసంశెట్టి దర్శకత్వం వహించిన చిత్రంలో. ఇందులో కమెడియన్ సత్య ఒక ప్రధాన పాత్ర పోషించాడు. శుక్రవారం విడుదల అయిన ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాకి విమర్శకుల నుంచి కూడా మంచి స్పందన లభించలేదు.  దాంతో సినిమాకు మంచి ఓపెనింగ్స్ కూడా రాలేదు. ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ. 85 లక్షలు మాత్రమే వసూలు చేసిందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సుమారు రూ. 75 లక్షలు మాత్రమే వసూల్ చేసిందని అంటున్నారు. వారాంతం శని, ఆదివారాల్లో కలెక్షన్స్ ఈ సినిమా భవితవ్యం తేల్చనున్నాయి.