పటాన్చెరు పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గురువారం మహంకాళి బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ బీ.ఆర్.ఎస్ యువత నాయకులు వి.ప్రవీణ్ రెడ్డి మహంకాళి బోనాల జాతరలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా యువ నాయకులు ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు బోనాల పండుగ ప్రతీకగా నిలుస్తుంది అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీ.ఎం కేసీఆర్ గారు బోనాల పండుగను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తుండడం జరుగుతుందన్నారు. ప్రకృతి మాతను పూజిస్తూ… అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖ:సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ప్రవీణ్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ నిర్వాహకులు గూడెం మధుసదన్ రెడ్డి గారు, గూడెం విష్ణువర్ధన్ రెడ్డి గారు, గూడెం విక్రమ్ రెడ్డి గారు, విజయ్ గారు(పటాన్చెరు మార్కెట్ కమిటీ చైర్మన్), సందీప్ గారు, మున్సిపల్ బి.ఆర్.ఎస్ యువత నాయకులు రవితేజ గారు, శ్రీకాంత్ గారు, తదితరులు పాల్గొన్నారు.