రాజమౌళి గారి తండ్రి విజయేంద్ర ప్రసాద్ గారు MNJ కేన్సర్ ఆసుపత్రిలో పేషెంట్ కేర్, సెక్యూరిటీ, వంటి విషయాల వ్యయం రెండేళ్ల పాటు తామే భరిస్తామని ముందుకు వచ్చారు. ఆస్కార్ సాధించడం పట్ల  రాజమౌళిని మంత్రి హరీశ్ రావు సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు. రాజమౌళి గారి సినిమాలో ప్రేరణ కనిపిస్తుంది. దేశ భక్తి, సామాజిక స్పృహ కనిపిస్తుంది అని అభినందించారు. మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. బంజారాహిల్స్ లో లిటిల్ స్టార్స్ అండ్ షీ ప్రైవేటు ఆస్పత్రి ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి హరీశ్ రావు, ప్రముఖ డైరెక్టర్ రాజమౌళి అంతకుముందు మాట్లాడిన రాజమౌళి గారు మంత్రి హరీశ్ రావు పనితీరు పై ప్రశంసలు కురిపించారు. సిద్దిపేట నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందింది అన్నారు. తాను చూసిన నాటికి ఇప్పటికీ ఎంతో మార్పు వచ్చిందన్నారు. పని తీరు చూసిన నాటి నుండి హరీశ్ రావు గారికి తాను పెద్ద అభిమానిగా మరానని రాజ మౌళి చెప్పుకొచ్చారు.