రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ప్రజలకు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాయడంపై వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. దీనిపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్పందిస్తూ… రాష్ట్ర ప్రజలకు ఒక మాజీ ముఖ్యమంత్రి లేఖ రాయడం కూడా నేరమేనా? అని ప్రశ్నించారు. జైల్లోని వీడియోలను మీరు విడుదల చేసినప్పుడు నిబంధనలు మీకు గుర్తుకు రాలేదా? అని మండిపడ్డారు. చంద్రబాబు భద్రతపై ఇప్పటికే ఎన్నో అనుమానాలు ఉన్నాయని… అనుమానాలు మరింత పెరిగేలా జైలు అధికారుల తీరు ఉందని చెప్పారు. చంద్రబాబు ఆరోగ్యానికి సంబంధించిన నిజాలను కూడా దాస్తున్నారని అన్నారు. అరకొర వివరాలతో హెల్త్ బులెటిన్ ఇస్తున్నారని విమర్శించారు.