వచ్చే సంవత్సరంలో ఎన్నికలు జరగటం ఏమో కానీ రాజకీయాలు మాత్రం మహా రసవత్తరంగా జరుగుతున్నాయి. రాజకీయ నాయకుల మాటల తూటాలకి ప్రత్యర్ధులు సైతం దీటైన సమాధానాలు ఇస్తున్నారు. అదే వరుసలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ పొత్తుల గురించి మాట్లాడటం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతుంది. ఇంతకీ పవన్ కళ్యాణ్ పొత్తుల గురించి ఏం చెప్పారంటే.. పొత్తులకి సంబంధించిన నిర్ణయం ఇప్పటికిప్పుడే తీసుకునేది కాదని సమగ్ర అధ్యయనం చేసిన తర్వాతే నిర్ణయం తీసుకుంటానని అందుకు చాలా టైం ఉందని చెప్పారు పవన్ కళ్యాణ్. ఎన్నికలకు కలిసి వెళ్లాలా లేదంటే ఒంటరిగా వెళ్లాలా అనేది అందరి అభిప్రాయం తీసుకున్న తర్వాతే అడుగు ముందుకు వేస్తానంటూ చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్. అదే సమయంలో తమ నాయకులకు పొత్తుల గురించి ఎవరి సొంత అభిప్రాయాలని వారు ఎక్కడా ప్రస్తావించవద్దని అలా చేసినట్లయితే పార్టీ పరంగా క్రమశిక్షణ చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అధికారం రావాలని అందరికీ ఉంటుంది బలంగా పనిచేస్తే అదే వస్తుంది. ఎక్కడ సభ పెట్టిన చాలామంది జనాలు వస్తున్నారు ఆ సమూహాన్ని కాపాడుకోవడం అత్యంత అవసరం అని చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్. జనసేన పార్టీ ప్రజల్లోకి బలంగా వెళ్తుంది ఎలాంటి సమస్యపై మనం మాట్లాడిన అది ప్రజల్లోకి నేరుగా చేరిపోతుంది. పార్టీ ప్రజల్లోనే ఉందని ఉపయోగ గోదావరి జిల్లాలో అది మరింత బలంగా ఉందని వివరించారు.