ఏపీలో వైసీపీ పాలనలో దళితులపై దాడులు పెరిగిపోయాయని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. దళితులను చంపి, డోర్ డెలివరీ చేస్తున్నారని అన్నారు. అరాచకాలను ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని చెప్పారు. దళితులకు గుండు కొట్టించి అవమానిస్తున్నారని అన్నారు. వీటన్నింటినీ మన రాష్ట్రం చూసిందని చెప్పారు. ఎస్సీలను వేధిస్తూ…  అంబేద్కర్ విగ్రహాలు పెడితే ఏం ప్రయోజనమని చెప్పారు. రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఆమె జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలపై మండిపడ్డారు.