I.N.D.I.A. కూటమి ఐక్యత అసాధ్యమని బీజేపీ విమర్శలు చేస్తోందని, కానీ వారి అంచనాలు తారుమారు చేస్తూ తమలో ఏకాభిప్రాయం కుదరిందని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ముంబైలో జరిగిన రెండు రోజుల సమావేశం అనంతరం కూటమి నేతలు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ… బీజేపీ ఓటమికి తాము బలమైన నిర్ణయాలు తీసుకున్నామన్నారు. దేశంలోని అందరి నుండి దోచుకొని, కొంతమందికి మేలు చేసేందుకే మోదీ సర్కార్ కృషి చేస్తోందని దుయ్యబట్టారు. తమ కూటమిని ఓడించడం బీజేపీ వల్ల కాదన్నారు. తమ కూటమి 60 శాతం భారతీయులకు ప్రతీక అన్నారు. సీట్ షేరింగ్ ప్రక్రియను వేగవంతం చేస్తామన్నారు. తామంతా ఒక్కటైతే కనుక బీజేపీ వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోను గెలవలేదన్నారు. తాము అభివృద్ధి ప్రాతిపదికన ముందుకు సాగుతామన్నారు. భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందని, ఇది లడఖ్‌లో ప్రతి వ్యక్తికి తెలుసునని చెప్పారు. ఇది దేశ భద్రతకు సంబంధించిన అంశమన్నారు.