డ్రగ్స్ వ్యహారం మరోసారి టాలీవుడ్ ను షేక్ చేస్తోంది. ఈ కేసులో హీరో నవదీప్ ఉన్నట్టు వార్తలు వచ్చాయి. కేసులో నవదీప్ ను పోలీసులు ఏ29గా పేర్కొన్నారు. నవదీప్ పేరును సీపీ సీవీ ఆనంద్ ప్రెస్ మీట్ లో బయటపెట్టారు. అయితే సీపీగారు నవదీప్ అనే పేరు మాత్రమే చెప్పారని, యాక్టర్ నవదీప్ అని చెప్పలేదని నవదీప్ స్పందించాడు. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పాడు. తాను ఎక్కడకూ పారిపోలేదని, హైదరాబాద్ లోనే ఉన్నానని తెలిపాడు.మరోవైపు ఈ పరిణామాల నేపథ్యంలో తెలంగాణ హైకోర్టును నవదీప్ ఆశ్రయించాడు. ఈ కేసుతో తనకు సంబంధం లేదంటూ కోర్టులో పిటిషన్ వేశాడు. తనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరాడు. పిటిషన్ ను విచారించిన హైకోర్టు నవదీప్ కు ఊరటను కల్పించింది. నవదీప్ ను అరెస్ట్ చేయొద్దని పోలీసులను ఆదేశించింది.

Previous articleపాకిస్థాన్ క్రికెట్ జట్టుతో ద్వైపాక్షిక సిరీస్ లపై వైఖరి వెల్లడించిన కేంద్రం…
Next articleసోషల్ మీడియాలో ఆసక్తికర వీడియో పంచుకున్న నారా బ్రాహ్మణి