తెలుగు సినీ ప్రేక్షకుల ఆదరాభిమానాలను చూరగొన్న హీరోయిన్లలో తాప్సీ ఒకరు. టాలీవుడ్ లో ‘ఝుమ్మంది నాదం’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన తాప్పీ… తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో పలు చిత్రాల్లో నటించిన తాప్సీ… బాలీవుడ్ లో సైతం పలు చిత్రాల్లో వైవిధ్యభరితమైన పాత్రల్లో నటించి టాలెంటెడ్ ఆర్టిస్ట్ గా గుర్తింపు పొందింది. 
మరోవైపు తాప్సీ డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మాథిస్ బోతో ప్రేమలో ఉందంటూ ఇప్పటికే ఎన్నో వార్తలు వచ్చాయి. అయితే ఈ అంశం గురించి ఆమె ఎప్పుడూ మాట్లాడలేదు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె తన ప్రేమ గురించి పలు విషయాలను వెల్లడించింది.