జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో జనసేన పార్టీ అభ్యర్ధుల పక్షాన ఎన్నికల్లో ప్రచారం చేయడానికి స్టార్ క్యాంపెయినర్లను ప్రకటించారు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు, అంబటి రాయుడు, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్, మొగలిరేకులు సీరియల్ ఫేమ్ సాగర్ ,కమెడియన్ పృథ్వీ, కమెడియన్ హైపర్ ఆది, కమెడియన్ గెటప్ శ్రీను జనసేన పార్టీ క్యాంపెయినర్ల లిస్ట్‌లో ఉన్నారు..అయితే పవన్ కళ్యాణ్ ప్రకటించిన జనసేన స్టార్ క్యాంపెయినర్లలో కమెడియన్లే ఎక్కువ ఉండటం విశేషం.. . నాగబాబు గతంలో జబర్దస్త్ కమెడియన్లందరికీ జడ్జీగా చేసిన విషయం తెలిసిందే .ఇక పవన్ ప్రకటించిన స్టార్ క్యాంపెయినర్లలో ఉన్న హైపర్ ఆది, గెటప్ శ్రీను‌లు కూడా జబర్దస్త్‌ షోతోనే బాగా పాపులర్ అయ్యారు. . జానీ మాస్టర్, కమెడియన్ పృథ్వీ, ఎటొచ్చీ సీరియల్ నటుడు సాగర్.. క్రికెటర్ అంబటి రాయుడు లు కూడా జనసేన స్టార్ క్యాంపెయినర్లుగా ఎన్నికయ్యారు. అయితే అంబటి రాయుడు.. మొన్నటి వరకూ వైసీపీ పార్టీలో పనిచేశారు. గుంటూరు ఎంపీగా పోటీ చేస్తారనే టాక్ నడిచింది. అక్కడ టికెట్ రాకపోవటంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ తో కలిశారు. అయితే అక్కడ కూడా టికెట్ దక్కపోవడంతో.. మళ్లీ వైసీపీ వైపు యూటర్న్ తీసుకుంటున్నారనే వార్తలు వినిపించాయి. కానీ.. అంబటి రాయుడ్ని జనసేన పార్టీ స్టార్ క్యాంపెయినర్‌గా ప్రకటించడంతో.. ప్రస్తుతానికి ఆయన జనసేనలో కొనసాగుతున్నారు.