Monday, September 16, 2024

Telangana: రేవంత్ రెడ్డి పేద పిల్లలపై కక్ష సాధింపు మంచిది కాదు

  • గచ్చిబౌలి గౌలిదొడ్డిలోని గురుకుల పాఠశాలను సందర్శణ.

Telangana: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్న కోపంతో పేద పిల్లలు చదువుకుంటున్న గురుకులాలపై మంచిది కాదని బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన శుక్రవారం గచ్చిబౌలి గౌలిదొడ్డిలోని గురుకుల పాఠశాలను వారు పరిశీలించారు మ విద్యార్థులు చేస్తున్న నిరసనకు మద్దతు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడారు. గురుకులాల కుట్రను మానుకోవాలని ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ సీఎం రేవంత్ రెడ్డి కి సూచించారు. బీఆర్ఎస్ నాయకుల మీద కోపాన్ని పేద విద్యార్థుల మీద చూపొద్దన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ దార్శనికతతో పేద పిల్లల కోసం గురుకులాలు ఏర్పాటు చేశారన్నారు. అయితే గురుకులాల్లో మంచి విద్య అందుకున్నప్పటికీ కావాలనే కుట్రలు చేస్తున్నారని తెలిపారు. అనేక మంది పేద విద్యార్థుల తల్లి దండ్రులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారన్నారు. గురుకులాల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు కూడా నిరసనలో పాల్గొన్నారు. గురుకులాలను తొలగించాలనే కుట్ర మరొక్కసారి పేద వర్గాలకు విద్య అందకుండా చేయడమే అన్నారు. ఇప్పటికీ గురుకులాల విద్యార్థులు సాధించిన ప్రతిభను చూడాలన్నారు. మెరుగైన వసతులు కల్పించాల్సిందిపోయి గురుకులాల అస్తిత్వాన్ని సమూలంగా తొలగించే ప్రయత్నాన్ని అడ్డుకుంటామన్నారు. ఈయన వెంట మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే లు బాల్కసుమన్, తదితరులు ఉన్నారు

మీరు ఈ వార్తలు ఇంకా చదవలేదు.

తాజా వార్తలు