Serilingampally : గలాటలో హరీష్ రావు చేతికి గాయం… హాస్పెటల్ కి వెళ్ళొదంటున్న పోలీసులు

Serilingampally: సీపీ ఆఫీస్ దగ్గర నిరసన వ్యక్తం చేస్తున్న సమయంలో దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసారు పోలీసులు.ఈ ఘర్షణలో భాగంగా మాజీ మంత్రి హరీష్ రావు చేతికి గాయం అయింది.ఈ సంఘటనలో పోలీసులు మరియు ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు హరీష్ రావు. ప్రస్తుతం AIG హాస్పిటల్ లో ఆయన గాయానికి చికిత్స నిర్వహించిన వైద్యులు. ఈరోజు కూడా రావాల్సి ఉందని చెప్పడంతో హాస్పిటల్ కి బయలుదేరారు హరీష్ రావు. ఈ క్రమంలో ఆయన ఇంటికి భారీగా చేరుకున్న పోలీసులు హరీష్ రావు పరివారాన్ని మోహరించి ఆయన్ను హాస్పిటల్ కి వెళ్లకుండా అడ్డుకున్నారు. అయితే ప్రజాస్వామ్యంలో గాయానికి చికిత్స చేసుకునే హక్కు కూడా మాకు లేదా అని హరీష్ రావు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ,పోలీసుల చర్యలను తీవ్రంగా ఖండించడంతో, దిగివచ్చిన పోలీసులు దగ్గరుండి హరీష్ రావును AIG హాస్పిటల్ కి తీసుకుని వెళ్లి చికిత్స జరిపించారు. ఈ సంఘటన నిరంకుశ పాలనకు నిదర్శనమని, ఇటువంటి దుర్మార్గపు ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదని ప్రభుత్వం తీరుపై హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేసారు.

మీరు ఈ వార్తలు ఇంకా చదవలేదు.

తాజా వార్తలు