Telangana: గురుకుల విద్యార్థుల నిరసనకు బీఆర్ఎస్ మద్దతు..

Telangana: గచ్చబౌలి గౌలిదొడ్డిలోని గురుకుల పాఠశాల విద్యార్థుల నిరసనకు మద్దతు తెలిపారు బి. ఆర్.స్ నాయకుడు జగదీష్ రెడ్డి. దేశంలోనే కార్పోరేట్ కు ధీటుగా పాఠశాలలు ఉండాలనే లక్ష్యంతో ఆనాటి ప్రభుత్వం గురుకులాలను ఏర్పాటు చేసిందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన ఈ సందర్భంగా శుక్రవారం బీఆర్ఎస్ నాయకులు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, జగదీశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకుడు ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే లు బాల్క సుమన్,గువ్వల బాల్ రాజు విద్యార్థుల వద్దకు వెళ్లి సంఘీబావం తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో అత్యంత ప్రతిభావంతులైన పేద విద్యార్థులు చదివే మంచి విద్య అందించాలనే ఉద్దేశంతో అప్పట్లో గురుకుల బోర్డులో చర్చించి ఓపెన్ మార్కెట్ లో ఉత్తమ ఉపాధ్యాయులు, లెక్చరర్లను రిక్రూట్ చేశారన్నారు. ఈ పాఠశాలలు అని తెలిపారు. అటువంటి వ్యవస్థలో ఉన్న గురుకులాల్లో నేడు వాళ్లందరినీ విధుల నుంచి తీసేయడం దారుణమన్నారు. గురుకులాలను కాపాడాల్సిన బాద్యత ఉందని పూర్వ విద్యార్థులు కూడా కలిసి రావాలని కోరారు. గురుకులాల్లో వ్యవస్థ ను మెరుగు పరిచే చర్యలు ప్రభుత్వం తీసుకోవాలని డిమాండ్ చేశారు.

మీరు ఈ వార్తలు ఇంకా చదవలేదు.

తాజా వార్తలు