సంక్షేమం అంతా ఒక్క కార్డుతోనే! | Telangana Digital Card | One State One Card | తెలంగాణ ప్రభుత్వం ప్రయోగం

సంక్షేమం అంతా ఒక్క కార్డుతోనే..! One State One Card – Digital Card
-ప్రతిష్టాత్మక ప్రయోగానికి ప్రభుత్వం శ్రీకారం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలనలో భాగంగా మరింత దృష్టి సారించింది. అయితే ప్రజలకు అందాల్సిన సంక్షేమం, ఇతర ప్రభుత్వ పథకాలకు అన్నింటికీ సూచనగా ఒక కార్డులోనే ఉండేలా ప్రయోగాత్మక చర్యకు శ్రీకారం చుట్టనుంది. ప్రభుత్వం ప్రవేశ పెట్టే వివిద సంక్షేమ పథకాలు అర్హులకు, ప్రజలకు అందేలా అనేకమైన పత్రాలు అవసరం లేకుండా ఒకే కార్డులో వివరాలు ఉండి.. పథకాల దరఖాస్తుకు ఆ ఒక్క కార్డునే ప్రామాణికం చేస్తే సరిపోతుందనే అంచనాకు వచ్చినట్లు సమాచారం. క్యాబినేట్ మంత్రుల బేటీలో ప్రజలకు అందాల్సిన సంక్షేమం, పథకాలు తొందరగా చేరవేసే చర్యల్లో బాగంగా ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది.

ప్రధానంగా రేషన్ సరుకుల కోసం రేషన్ కార్డు, ఆరోగ్య అవసరాల కోసం ఆరోగ్య శ్రీ, ఇతర పథకాలకు ఆయా ధృవపత్రాలు అందజేయాల్సి వస్తుంది. అయితే కొన్ని సార్లు లబ్దిదారుల పొరపాట్లు, తొందరపాటు వల్ల కూడా సరైన ధృవపత్రాలు అప్పజెప్పకపోతే వారు అనర్హులుగా మిగిలిపోతున్నారు. అటువంటి వాటికి చెక్ పెట్టి ఒకే గొడుగు కిందకు తెస్తే ప్రభుత్వానికి సమయం ఆదా అవుతుందని ఫలితంగా లబ్ధిదారుల ఎంపికలోనూ జాప్యం కాకుండా ఉంటుందనే అంచనాకు వచ్చినట్లు సమాచారం.

తెలంగాణ స్టేట్…డిజిటల్ కార్డు.. One State Digital Card

ప్రజాపాలనలో ఆరు గ్యారంటీల హామీల అమలుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు అవి అమలు చేయాల్సిన వాటిపై ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో మరో కొత్త ఆవిష్కరణకు వేదికగా నిలవనుంది. తెలంగాణ రాష్ట్రంలో లబ్ధిదారులకు డిజిటల్ కార్డులు అందజేసి రేషన్ సరుకులు (Ration) , హెల్త్ స్కీములు Health Schemes , ఇతర పథకాలకు ప్రామాణికం చేయనున్నారు. కాగా ఇటువంటి ప్రయోగత్మక కార్యాచరణకు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

Also Read ; రైతు భరోసాకు గ్రీన్ సిగ్నల్!వీళ్లకు మాత్రమే రైతు భరోసా! Rythu Bharosa Telangana

పలు రాష్ట్రాలకు అదికారుల బృందం..

డిజిటల్ కార్డు ( Digital Card )ద్వారా లబ్దిదారులను ఎంపిక చేసే కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే అమలవుతున్న ఆయా రాష్ట్రాల్లో తెలంగాణ అధికారుల బృందం పర్యటించనున్నారు. అక్కడ పర్యటన అమలవుతున్న విధానం అనంతరం తెలంగాణ లో డిజిటల్ కార్డుకు (Telangana Digital Card ) శ్రీకారం చుట్టనున్నారు. అందులో భాగంగా ఇప్పటికే అమలవుతున్న Rajasthan, Haryana and Karnataka రాష్ట్రాల్లో అధికారుల బృందం పర్యటించనుంది.

మీరు ఈ వార్తలు ఇంకా చదవలేదు.

తాజా వార్తలు